Friday, April 26, 2024

ధర్మం – మర్మం : పయోవ్రతం (ఆడియోతో…)

భాద్రపద మాస కర్తవ్యాల గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పయో వ్రతం:-
భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు సంతానం కోరు యువతులు పయో వ్రతమును ఆచరించవలెను. భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు పెద్దల అనుమతితో దంపతులు ఇరువురూ సంతానము కోరి పయో వ్రతమును ఆచరించవలెనని దీక్ష తీసుకోవలెను. ఈ 12 రోజులు అన్నాదులు తీసుకోకుండా పాలు, పెరుగు, నెయ్యి, పాయసంతోనే ఉండవలెను. ఆవు పాలు, పెరుగు, నెయ్యి వీటితో చేసిన పాయసమునను మాత్రమే ఆహారముగా తీసుకొనవలెను. దూడ చనిపోయిన ఆవు పాలు పనికిరావు. ప్రతీ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానాదులు ముగించుకుని పంచగవ్యమును మూడు సార్లు తీసుకొని ఈ వ్రతాంగముగా హరిని పూజించవలెను.

నెయ్యి కలిసిన పాయసం కావున రుచి కలిగి ఎక్కువగా తీసుకోకూడదు. బియ్యమును గోమూత్రముతో వండి దానితో పాయసము చేయవలెను. మీగడ, వెన్న, పాలు, నెయ్యి ఇవన్నీ పాలతో ఏర్పడేవే కావున ఈ వ్రతమునకు పయోవ్రతము అని పేరు. ఈ వ్రతము నందు మజ్జిగ తీసుకోరాదు. ఈ వ్రతమును ఏడు రోజులు ఆచరించి పైన చెప్పిన రీతిగా ఆహారమును తీసుకొని లక్ష్మీనారాయణులను ప్రాత:కాలమే ఆరాధించి ఏడు రోజులు లేదా 12 రోజులు ప్రతీ దినం బ్రాహ్మణునితో వామనావతార కథ వినవలయును. స్కాందపురాణానుసారం భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు ఈ వ్రతమును ఆచరించవలెనని చెప్పియున్నారు.

పయో వ్రతము చేయువారు ఈ 12 రోజులు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మీగడ ఈ ఐదింటిని విడిచి పెట్టాలని మరొక వాదన ఉంది. భాద్రపద శుద్ధ చతుర్దశి అనగా అనంతపద్మనాభ చతుర్దశి నాడు వ్రత సమాప్తి చేయవలెనని కూడా చెప్పియున్నారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement