Sunday, May 5, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(3)(ఆడియోతో…)

స్కాంద పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

నదానేన వినా కించిత్‌ దృశ్యతే భువనత్రయే
దానేన ప్రాప్యతే స్వర్గ: శ్రీ: దానేనైవ లభ్యతే
దానేన శత్రూన్‌ జయతి వ్యాధి: దానేన నశ్యతి
దానేన లభ్యతే వి ద్యా దానేన యువతీ జన:
ధర్మార్ధ కామ మోక్షాణామ్‌ సాధనం పరమం స్మృతమ్‌

ఈ మూడు లోకములలో దానము తప్ప మరేదీ కనబడదు. దానముతో స్వర్గము, సంపద లభించును. దానముతో శత్రువులను జయించవచ్చును, వ్యాధులు కూడా నశించును. దానముతో
విద్య లభించును మరియు కోరుకున్న యువతి లభించును. ధర్మము, అర్ధము, కామము మరియు మోక్షము కూడా దానముతో లభించును.

వైద్యునికి కావాల్సిన దానిని దానము చేస్తే ఆయన మన వ్యాధిని మందులతో పోగొట్టును. గురువుగారికి అవసరమైన సేవలు, ధన, ధాన్య, వస్త్రాదులు ప్రసాదిస్తే సంతోషించి గురువు విద్యను ప్రసాదించును. దానము చేసినచో శత్రువు తన వైరాన్ని వీడి మిత్రుడగును. ఈ వి ధంగా దానముతో ధర్మార్ధ కామమోక్షములు లభించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement