Friday, May 3, 2024

దీపం జ్యోతి పరబ్రహ్మ!

సర్వ శుభాలను ఇచ్చేది దీపారాధన. దీపంలో దేవతలు ఉంటారు. వేదాలు ఉంటాయి. ఎంతో విశిష్టమైన దీపాన్ని వెలిగించడానికి పాటించాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవే మిటో తెలుసుకుందాం.
దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఇంటి ఇల్లాలు తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడోది అన్నద మ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గైరవం, ధర్మవృద్ధిలకు, అయిదవది వంశాభివృద్ధికి అని స్కాంద పురాణం చెబుతోంది. దీపారాధ ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.
అవునేతితో, నువ్వుల నూనెతో దీపారాధ చేయడం శ్రేష్ఠం. ఆవునెయ్యిలో సూర్యశక్తి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవునెయ్యి, నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు చేకూరుతాయి.
వేపనూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపి ఈశ్వరుని ముందు దీపం వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరినూనెతో దీపారాధన అర్థనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజకి కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. దుష్ఫలి తాలు దూరంచేసి సకల శుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణు అంశ మూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశనగ నూనె దీపారాధనకు అసలు పనికిరాదు.
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన పెట్టిన ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీ నమై, అలక్ష్మీ స్థానం అవుతాయి. దీపారాధన లేకుండా దేవతా రాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం.
దీపం వెలిగించే కుంది కింది భాగం బ్రహ్మ, మధ్యభాగం విష్ణుమూర్తి, పైభాగం శివుడు. కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీదేవి, దీపారాధన చేయడానికి వెండి, పంచలోహ కుందులు విశిష్టమైనవి. మట్టి కుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. లేదా కనీసం ఏదైనా ఆకుమీదనైనా పెట్టాలి. దీపారాధన చేసిన తర్వాత చేతిని నీటితో కడగకూడదు. వెలిగించిన దీపాన్ని తిప్పడం, కదల్చడంలాంటివి చేయకూడదు. తడిబట్టలతో దీపాన్ని వెలిగించకూడదు. కనీసం ఇంట్లో లైట్‌ స్విచ్‌ని కూడా తడిబట్టలతో వేయకూడదు.
నుదుట ఏ బొట్టు లేకుండా దీపా రాధన చేయకూడదు. అసురసంధ్యవేళ (అనగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు దాకా) శివాలయంలో దీపారాధన చేస్తే శివలోక ప్రాప్తి లభిస్తుం దట. కార్తీక మాసంలోకాని, మహాశివ రాత్రి రోజున కాని, ఆరిపోతున్న ప్రమిద లో నూనె వేసినా, దాన్లోని వత్తిని పైకి జరిపినా శివుడు మోక్షం ప్రసాదిస్తా డుట. శివాలయంలో నందీశ్వరుని ఎదు రుగా అనగా శివలింగానికి ఎదురుగా నూనె దీపం వెలిగించ కూడదు. ఆరిపోయిన దీపాల్లోని నూనెను తీసుకొని మరొక దీపం వెలిగించకూడదు. ఆరిపోయిన దీపం అశుభానికి సంకేతం. పద్మాసనం వేసుకుని మాత్రమే దీపారాధన చేయాలి. దీపారాధన చేయగానే దానికి మూడు వైపుల పై భాగాన బ్రహ్మ స్వరూపానికి, విష్ణు స్వరూపానికి, మహేశ్వర స్వరూపానికి కుంకుమ బొట్టు పెటి, కుంది లేదా, ప్రమిద క్రింది భాగాన అక్షతలు లేదా అయిదు పువ్వులు వుంచాలి. ఐదు పువ్వులు పంచ భూతాలకి ప్రతీకలు. అంటే ఒక్క దీపారాధన చేస్తే ఇంతమందిని తృప్తిపరుస్తార న్నమాట.
– చివుకుల రాఘవేంద్రశర్మ
9642706128

Advertisement

తాజా వార్తలు

Advertisement