Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 16
16.
కర్మణ: సుకృతస్యాహు:
సాత్త్వికం నిర్మలం ఫలమ్‌ |
రజసస్తు ఫలం దు:ఖమ్‌
అజ్ఞానం తమస: ఫలమ్‌ ||

తాత్పర్యము : పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్త్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కాని రజోగుణకర్మము దు:ఖమును, తమో గుణకర్మము ఆజ్ఞానమును కలిగించును.

భాష్యము : సత్త్వ గుణముతో చేయు పనుల ఫలితము నిర్మలముగా ఉంటుంది. అందువలన ఋషులు మోహము చెందనివారై ఆనందముతో నుందురు. కానీ రజోగుణముతో చేయు పనులు దు:ఖమునకు కారణమగును. గొప్ప భవంతిని నిర్మించవలెనన్న ఎంతో శ్రమించవలసి ఉంటుంది. చివరికి ‘ నాకు ఈ భవంతి ఉన్నది అనే ఆనందము ఉన్నా’ అది నిజమైన సంతృప్తిని కలుగజేయదు. ఇక తమో గుణముతో కార్యములు చేయువాడు అజ్ఞానములో నుండుటచే ప్రస్తుతము దు:ఖమును పొందుటయే కాక వచ్చే జన్మలో జంతు జీవితము లభించు అవకాశము కలదు. అమాయకపు జంతువులను చంపువారు మరుజన్మలో ఆ జంతువులుగా పుట్టవలసి వస్తుందని గుర్తించరు. అందరూ భగవంతుని బిడ్డలే. చిన్న చీమకు హాని తలపెట్టినా భగవంతుడు వదిలిపెట్టడు. భగవంతుని చట్టము ప్రకారము శిక్షింపబడతారు. నేటి సమాజము ఈ విషయజ్ఞానము లేక రజో తమో గుణ ప్రభావము చేత అధోగతి పాలగుచున్నది. కాబట్టి అందరూ కృష్ణ చైతన్యవంతులై మానవాళిని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement