Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 24
24.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే
కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం
కర్మ కర్తుమిహార్హసి ||

తాత్పర్యము : కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమముల ద్వారా, కార్యమననేమో, అకార్యమననేమో అవగాహనము చేసికొనవలెను. అట్టి విధి నియమములను తెలిసియే మనుజుడు కార్యము నొనరించవలెను. తద్ద్వారా అతడు క్రమముగా ఉద్ధరింపబడగలడు.

భాష్యము : బద్ధ జీ వులలో నాలుగు దోషములుం డును. ఇంద్రియముల ద్వారా సరైన అవగాహన పొందలేక పోవుటచ మోహము చెందే అవకాశము, తప్పులు చేసే స్వభావము మరియు వాటిని కప్పి పుచ్చుటకు ఇతరులను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నము అను ఈ దోషముల వలన బ ద్ధ జీవి ఇతరులకు మేలు చేయు నియమ నిబంధనలను చేయలేడు. శాస్త్రములు ఈ దోషములకు అతీతముగా ఉండుటచే వాటిని యథాత థముగా స్వీకరించవలెనని సాధులు, మహాత్ములు, ఆచార్యులు సూచించుచున్నారు. అటువంటి శాస్త్రముల ముఖ్య ఉద్దేశ్యముల భగవంతుని అర్థము చేసుకొని భగవత్సేవ చేయుట. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకారము ”హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ” అను మంత్ర కీర్తన ద్వారా సులభముగా భగవద్భక్తిని పాటించవచ్చును.

అటువంటి భగవంతుణ్ని అర్థము చేసుకొనుటకు సహాయపడు వేద శాస్త్ర నియమాలను ధిక్కరించుట జీవుల అన్ని రకాల పతనములకు కారణమగును. ఆ అపరాధమునకు మాయ చేతిలో దండించబడతారు. అవి త్రిగుణముల ద్వారా విధించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రజో తమో గుణములను అధిగమించి సత్వ గుణమునకు చేరుకుని అసుర స్వభావమును విడిచి పెట్టవలసి ఉన్నది. లేకున్నచో రజోగుణము, తమో గుణ ప్రభావము వలన శాస్త్రములను సాధువులను భగవంతుణ్ని ధిక్కరించి స్వంత పద్ధతులను ఏర్పాటు చేసుకొనును. ఈ లోపములు మానవ సమాజాన్ని అసుర స్థితిలోనికి నెట్టి వేయుచున్నవి. కాబట్టి ప్రామాణిక గురువు మార్గదర్శకత్వమును స్వీకరించి సరైన పద్ధతిని అవలంభించినట్లయితే జీవిత లక్ష్యమును తప్పక సాధించగలుగుతారు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
దైవాసురసంద్విభాగయోగో నామ షోడశోధ్యాయ:
….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement