Tuesday, May 14, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 21

21.
అవ్యక్తోక్షర ఇత్యుక్త:
తమాహు: పరమాం గతిమ్‌ |
యం ప్రాప్య న నివర్తంతే
తద్ధామ పరమం మమ ||

తాత్పర్యము : వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.

భాష్యము : బ్రహ్మదేవుడు ‘బ్రహ్మసంహిత’ అను గ్రంధమున శ్రీ కృష్ణుని ధామమును గురించి వర్ణించినాడు. అది చింతామణి ధామమని, అనేక కల్ప వృక్షముల ను కలిగి, కామధేనువుల వంటి సురభి ఆవులతో నిండి ఉంటుందని, ల క్షల కొలదీ లక్ష్మీదేవులు శ్రీకృష్ణున్ని సేవిస్తూ ఉంటారని వివరించినాడు. సర్వకారణులకు కారణుడైన శ్రీకృష్ణుడు గోవిందుడుగా పిలవబడతాడని, అతడు వేణువును ఊదుచూ, పీతాంబరమును ధరించి పూలమాలతో అలంకరించబడి, తలలో నెమలి పింఛమును నీలమేఘ చాయను, కమలముల వంటి కన్నులను కలిగి వేలకొలది మన్మధుల కంటే ఆక ర్షణీయంగా ఉంటాడని చెప్పియున్నాడు. ఇక్కడ భ గవద్గీత యందు కేవలము కొద్దిపాటి వివరణ మాత్రమే ఇవ్వబడినది. అలాగే శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు, ఢిల్లిdకి ఆగ్నేయమున 90 మైళ్ల దూరములో ఉన్న బృందావనమున తన లీలలను చేసెను. దీని విస్తీర్ణము 84 చదరపు మైళ్లు, ఇది మధుర జిల్లా క్రిందకు వస్తుంది. ఈ బృందావనము శ్రీకృష్ణుని ధామమును కన్న భిన్నము కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement