Monday, April 29, 2024

గర్భవతి సీత అభిలాష

సీతారాములు నిత్యం వినోదాలతో, ఉద్యానవన విహారాలతో పదివేల సంవత్సరాలు రాజ్యభోగాలను అనుభవించారు. అత్యంత తప్తికరమైన దాంపత్య జీవితాన్ని సుఖసంతోషాలతో అనుభవించారు. సీతమ్మ గర్భవతి అయ్యింది. గర్భవతి చిహ్నాలను చూసిన రాముడు సంతోషపరవశుడై, ఆమె మనో రథాన్ని తెలుపుమని అడిగాడు. ”తపోవనాలను దర్శించి మునీశ్వరులు, మునికాంతల దీవనలు పొందాలని ఆశిస్తున్నాను” అన్నది సీత. ఇదేమి వింత కోరిక! అని రాముడు మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత సీత సత్పురుష దర్శన ప్రీతికి, హదయ నైర్మల్యానికి ఆనందించాడు. ”నీ కోరిక తప్పక తీరుస్తాను” అని రాముడు వాగ్దానం చేశాడు.

లోకాపవాదం
ఒకనాడు శ్రీ రాముడు చారులలో ప్రముఖుడైన భద్రుని చూసి ”భధ్రా! రాజ్య పాలనను గూర్చి ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ప్రజల కష్ట నిష్టూరాలను నీవు యథాతధంగా తెలపాలి. రాజులకు కన్నులూ చెవులు గూఢాచారులే! రాజ్య వ్యవస్థ బాగోగులు గూఢచారుల నిజాయితీ వర్తనంపై ఆధారపడి ఉంటాయి. అనే సంగతి జగమెరిగిన సత్యం! రాజనీతి ఈ విషయాన్ని ఘంటా పథంగా నిర్దేశిస్తున్నది. రాజ్యపాలనలో దోషాలు సామాన్య ప్రజల ముఖంగానే తెలుస్తాయి. వాటిని రాజులకు చేరవేయడం చారుల కర్తవ్యం. తద్వారా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా దోషాలను పరిహరిస్తూ, రాజులు ప్రజారంజకంగా పాలించగలరు! నన్ను, సీతను, భరత లక్ష్మణ శత్రుఘ్నులను గూర్చి, రాజకుటుంబాన్ని గూర్చి ప్రజలు ఏమనుకొంటున్నారో మొగమాటం లేకుండా నిర్భ యంగా చెప్పవచ్చు. భీతితో లేదా మొగమాటంతో సత్యం చెప్పక పోవడం రాజ ద్రోహం అవుతుంది” అన్నాడు.
భద్రుడు భక్తి వినయాలతో శ్రీ రామునికి నమస్కరించాడు. ”ప్రభూ! ప్రజలు మీ విజయాలను కథలు కథలుగా ముచ్చటించు కొంటున్నారు. మీ ధర్మ పాలనను వేన్నోళ్ళ ప్రశంసిస్తున్నారు. మీ ఆశ్రిత జనరక్షణ కృత్యాన్ని కీర్తిస్తున్నారు. వానర వీరుల సాయంతో సముద్రంపై సేతువు కట్టి, లంకను జయించడం, కిష్కింధను సుగ్రీవునికి, లంకను విభీషణునికి కట్ట బెట్టడం మున్నగు సాహస కృత్యాలను అభినందిస్తున్నారు. సీతాపహరణను తలచుకుని చింతిస్తున్నారు. పల్లిdయులు, పురజనులు, నగర ప్రజలు సీత ఒక సంవత్సరం పాటు రావణుని చెరలో ఉన్నది కదా! ఆమె పరమ పునీతురాలని తలచి రాముడు మరల స్వీకరించాడు. అయోధ్యకు కొని వచ్చాడు. మనం కూడ భార్యల విషయంలో ఈవిధంగానే వర్తించాల్సి ఉంటుందేమో! పరుల పంచన ఏడాదిపాటు పడి ఉన్న భార్యను ఏలుకోవడం రాముని ఉదార గుణం అయితే కావచ్చు గాక! ఇలాంటి పని మనం చేయగలమా? అని పలు విధాలుగా చెప్పుకొంటున్నారు!” అన్నాడు భధ్రుడు.
రాముడు కొలువు చాలించి, అభ్యంతర మందిరంలో ప్రవేశిం చాడు. భద్రుని మాటలు అతని మనస్సును కలవరపెడుతున్నాయి. అతని హృదయం భగ్గుమంటున్నది. జానపదుల మాటలు రాముని మనస్సును కల్లోల పరుస్తున్నాయి. అతనికి మనశ్శాంతి కరువయ్యింది. అలజడి, ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హృదయం మథన పడుతున్నది. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను కొని రమ్మని ద్వారపాలకుని ఆజ్ఞాపించాడు.
ముగ్గురు సోదరులు రామాజ్ఞను అనుసరించి ఏకాంత మంది రం చేరుకున్నారు. హృదయ మథనానికి అద్దం పడుతున్నట్లు ఉన్న రాముని దీన సుఖాన్ని చూసి భయ సందేహ కంపితులయ్యారు. చింతాక్రాంతులయ్యారు. మూర్త్తీభవించిన దైన్య స్వరూపాన్ని చూసి విచలితులయ్యారు.
కళావిహీనమైన అన్నగారి ముఖాన్ని చూసి, కారణం తెలియ క సతమతమయ్యారు. దిగ్భ్రాంతులయ్యారు. అత్యంత ఆప్తులైన సోదరులను చూడగానే రాముని కన్నుల నుండి నీరు ధారా పాతంగా స్రవించింది. అతడు వారిని కౌగిలించుకున్నాడు. అప్ప టికి కానీ ఆయన తన హృదయ వేదనను భరింపలేకపోయాడు. అన్నగారి స్థితిని చూసి ”ఏకారణం వల్ల ఇలా అయ్యాడో” తెలుసుకోవాలనే సంకల్పంతో అని ప్రశ్నా ర్థకంగా రాముని కళ్ళలోకి చూశారు సోదరులు.

కె. ఓబులేషు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement