Friday, April 26, 2024

ఏపీఆర్టీసీ బస్సుల్లో దైవ దర్శనం టికెట్లు

తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు, సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement