Sunday, May 19, 2024

అన్మమయ్య కీర్తనలు : ఈతడే రఘురాముడీత

రాగం : నాట
9
ఈతడే రఘురాముడీత డేకాంగ వీరుడు
యీతడు చేసిన చేతలెన్నియైనా గలవు || ఈతడే ||

ఖరదూషణాదులను ఖండతుండములు నేసె
అరుదుగా వాలినొక్క యమ్మున నేనె
సరవి కొండల చేత సముద్రము బంధించె
ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము || ఈతడే ||

కూడపెట్టె వానరుల, కుంభకర్ణాది దైత్యుల
తోడనే రావణు జంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి గూడెను పుష్పక మెక్కె
యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన ||ఈతడే||

పుడమి యంతయు గాచె పొందుగా దనంతలేసి
కొడుకులగాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె
అడరి తారక బ్రహ్మమై ఇదె వెలసె || ఈతడే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement