Friday, May 3, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : హమీర్‌ కళ్యాణి
శరణం బితడే

శరణం బితడే సకలము నాకును
వెరవున మనసా విడువవో యితని || శరణం బితడే ||

అభయం బొసగేటి అతడెవ్వడు మును
యిభ రక్షకుడతడెవ్వడు
వుభయ విభూతల కొడయంబెవ్వడు
ప్రభువతడే నాపాలి దేవుడు || శరణం బితడే ||

శరణాగతులకు సరి దాపెవ్వడు
యిరవుగ శ్రీపతి యెవ్వడు
అరిది దుష్టదైత్య హంతకుడెవ్వడు
పరమును నతడే నాపాలి దేవుడు || శరణం బితడే ||

ఆది శంఖ చక్రాయుధు డెవ్వడు
యేదెన పూర్ణుడెవ్వడు
వేదమయుడు శ్రీ వేంకట పతియై
పాదాయనిదె నాపాలి దేవుడు || శరణం బితడే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement