Saturday, April 20, 2024

సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణం చేసిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. మీ విశేష అనుభ‌వం దేశానికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌న్నారు. మీ ప‌ద‌వీకాలం గొప్ప‌గా సాగాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శ‌నివారం ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. 48వ సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 2022, ఆగ‌స్టు 26వ తేదీ వరకు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. కొవిడ్ దృష్ట్యా కొద్దిమంది అతిథుల స‌మ‌క్షంలోనే జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఉప రాష్ర్ట‌ప‌తి వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్ర‌టేరియ‌ట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారులతో పాటు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు అతిథులంద‌రూ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప‌ద‌వీకాలం నిన్న‌టితో ముగిసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement