Thursday, May 2, 2024

రామ్ పోతినేని కోరిక తీరుతుందట!!

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఈ రోజు ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో రామ్ ఎప్పుడూ కనిపించని విధంగా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. తనకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఈ సినిమాతో తీరబోతుందట.

రామ్ కు ఎప్పటి నుంచో పోలీస్ డ్రెస్ తో, పాటు డాక్టర్ డ్రెస్ వేసుకోవాలని కోరిక ఉండేదట. అయితే ఈ సినిమాలో ఈ రెండు పాత్రలకు సంబంధించిన షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను చిట్టూరు శీను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement