Thursday, May 2, 2024

Anasuyaఏంటీ అంటీ… ఈ ఘాటు గుమ‌గుమ‌లు..

అనసూయ కంప్లీట్ గా తన లుక్ మార్చేసింది. క్రేజీగా అనిపించే లుక్ లో ఫోజులు ఇచ్చింది. బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది.

గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -


అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అందమైన చీరల్లో, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అనసూయ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ కంప్లీట్ గా తన లుక్ మార్చేసింది. క్రేజీగా అనిపించే లుక్ లో ఫోజులు ఇచ్చింది. మినీ డ్రెస్ లో ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అనసూయ కొత్త లుక్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఫోటోలకు అనసూయ అదిరిపోయే క్యాప్షన్ కూడా పెట్టింది. ‘నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ అనసూయ కామెంట్ పెట్టింది. తనని ట్రోల్ చేసే హేటర్స్ కోసమే అనసూయ ఈ క్యాప్షన్ పెట్టింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement