Friday, May 3, 2024

“విరూపాక్ష” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మిస్టిక్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ముందుగా తెలుగులో రిలీజ్ అయిన‌ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ అయ‌ని విరూపాక్ష ఇప్పటివరకూ రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరో వారంలో రూ.100 కోట్ల మార్క్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. కాగా, థియేటర్లలో భయపెట్టిన విరూపాక్ష ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ లో మే 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, రవికృష్ణ, సోనియా సింగ్, శ్యామల కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement