Friday, April 26, 2024

మహేష్ రాజమౌళి సినిమాపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. అలాగే దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ…దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

అయితే మామూలుగా రాజమౌళి రాసే కథలకు మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదు. అయితే మరి మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి జోనర్ ఎంచుకున్నాడు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ ఫ్రాంచైజ్ ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్లు ఓ విషయం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement