Tuesday, April 30, 2024

ప్రశాంత్ నీల్ అండ్ దిల్ రాజు….వయా విజయ్ దళపతి

కే జి ఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్2 ను తెరకెక్కిస్తున్నాడు. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దిల్ రాజు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టులో కూడా మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే నిజానికి ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చే సినిమా లో విజయ్ దళపతి నటించబోతున్నాడట.

విజయ్ దళపతి ఇటీవల మాస్టర్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. కాగా తన 67వ చిత్రాన్ని దిల్ రాజు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ముగ్గురు కూడా ఓ సారి సమావేశం అయ్యారట. ఈ సమావేశంలో ముగ్గురు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ప్రశాంత్ పడ్డాడట. అయితే సౌత్ ఇండియాలో లోని పలువురు స్టార్స్ ను కూడా ఈ సినిమాలో లో పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక దిల్ రాజు తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement