Thursday, May 2, 2024

విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌ క్లైమాక్స్‌

వెంకటేష్‌ నటిస్తున్న చిత్రం సైంధవ్‌. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన తన తొలి చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ని లావిష్‌ గా నిర్మించి సినిమాపై తనకున్న ప్యాషన్‌ చూపించారు. ప్రస్తుతం శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సైంధవ్‌ ‘ చిత్రాన్ని సైతం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు న్నారు వెంకట్‌ బోయనపల్లి.

‘సైంధవ్‌’ వెంకటేష్‌ 75వ చిత్రమిది. 16 రోజులలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు, ఎనిమిది మంది ముఖ్య నటీ-నటు-లు షూట్‌లో పాల్గొన్న -్లకె-మాక్స్‌ను హర్ష్‌ కండీషన్స్‌ లో చిత్రీకరించారు. యాక్షన్‌ ఎపిసోడ్‌ను రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ కంపోజ్‌ చేశారు.

నవాజుద్దీన్‌ సిద్ధిక్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారాతో సహా దాదాపు అన్ని ప్రధాన పాత్రలను మేకర్స్‌ పరిచయం చేశారు.

ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ మణికందన్‌ కెమెరామెన్‌ గా, గ్యారీ బిహెచ్‌ ఎడిటర్‌ గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ తాళ్లూరు సహ నిర్మాత

Advertisement

తాజా వార్తలు

Advertisement