Sunday, April 28, 2024

వరుణ్‌ తేజ్‌ సినిమా టైటిల్‌ “ఆపరేషన్‌ వాలెంటైన్‌”

వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్య చిత్రానికి టైటిల్‌ ప్రకటించారు. అలాగే విడుదల తేదీని సైతం వెల్లడించారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ చిత్రానికి ‘ఆపరేషన్‌ వాలెం-టైన్‌’ అనే ఆసక్తికరమైన -టైటిల్‌ ఖరారు చేశారు. డిసెంబర్‌ 8, 2023న ఈ సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు.

హిందీ, తెలుగులో విడుదలవుతున్న ఈ విజువల్‌ వండర్‌ తో వరుణ్‌ తేజ్‌ బాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ పాత్ర పోషిస్తున్నారు. రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో మానుషి చిల్లర్‌ కనిపించనుంది.

ఆపరేషన్‌ వాలెం-టైన్‌ దేశభక్తి, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎంటర్‌-టైనర్‌. ఫ్రంట్‌ లైన్‌ లో వున్న వైమానిక దళ వీరుల అలుపెరగని స్ఫూర్తిని, మునుపెన్నడూ చూడని పోరాటాన్ని, వైమానిక దాడులలో వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపనుంది.

ఈ చిత్రాన్ని సందీప్‌ ముద్దా నిర్మిస్తున్నారు. నందకుమార్‌ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుభవజ్ఞుడైన యాడ్‌-ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రాఫర్‌ , శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement