Tuesday, February 27, 2024

Mega Prince – వ‌రుణ్ తేజ్ కొత్త మూవీ ‘మ‌ట్కా’ … పోస్ట‌ర్ రిలీజ్

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ గాంఢీవధారి అర్జునను సిద్ధం చేస్తూనే మరో రెండు సినిమాలను ఆల్రెడీ సెట్స్‌ మీద కు తీసుకెళ్లాడు..దీనిలో భాగంగా ప‌లాస ఫేమ్ కరుణ్ కుమార్‌ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ సినిమాను గురువారం గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. ఈ మేరకు చిత్రబృందం టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు మట్కా అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. నోట్ల కట్టల మధ్య రాయల్‌ కారును చూపిస్తూ పోస్టర్‌ను ఆసక్తికరంగా డిజైన్‌ చేశారు. 1960వ దశాబ్ధంలో ఈ సినిమా కథ రూపొందనుంది. నానితో హాయ్‌ నాన్న చేస్తున్న వైరా సంస్థలోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement