Tuesday, April 13, 2021

పవన్ శిఖరం లాంటోడు:వేణు శ్రీరామ్

పవన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ విడుదలకు సిద్దమయింది. ఈ నెల 9వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ పై అసక్తికర కామెంట్స్ చేశాడు. పవన్ ను చూస్తే హిమాలయాలను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందన్నాడు. సినిమాకోసం పవన్ ను కలవడానికి వెళ్లినప్పుడ జరిగిన సంఘటనను వేణు శ్రీరామ్ గుర్తుచేసుకున్నాడు. త్రివిక్రమ్ గారు నన్ను వెంటబెట్టుకుని పవన్ కల్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళతారేమోనని అనుకున్నాను. కానీ త్రివిక్రమ్ గారి రూమ్ లో ఆరడుగుల కటౌట్ ను చూశాను .. ఆ కటౌట్ పేరే పవన్ కల్యాణ్. ఆయన అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుని కనిపించారు. చిన్నప్పుడు నేను హిమాలయాలను గురించి విన్నాను. ఆ తరువాత ఓ సారి షూటింగ్ కోసం వెళ్లినప్పుడు హిమాలయాలను దగ్గరగా చూశాను. పవన్ కల్యాణ్ గారిని మూడు అడుగుల దూరంలో చూసినప్పుడు నాకు హిమాలయాలు గుర్తుకు వచ్చాయన్నారు. హిమాలయాల్లోని ప్రశాంతత ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు నాకు లభించింది. ఒక మామూలు టైలర్ కొడుకునైన నాకు పవన్ సినిమా చేసే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టమని అని చెప్పుకొచ్చాడు వేణఉ శ్రీరామ్.

Advertisement

తాజా వార్తలు

Prabha News