Monday, April 29, 2024

‘ఉప్పెన’ నుంచి రెండు డిలీటెడ్ సీన్‌లు

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ‘ఉప్పెన’ మూవీ ఫిబ్రవరి 12న విడుదలైన ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు గ్రాస్‌ వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన నెలన్నర రోజుల తర్వాత డిలీటెడ్‌ సన్నివేశాలను ఒక్కక్కటిగా యూట్యూబ్‌లో చిత్ర బృందం అప్‌లోడ్‌ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన రెండు డిలీటెడ్‌ సన్నివేశాలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

https://youtube.com/watch?v=CXOTmlTxC1M

బేబమ్మకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ఆశీ పడే కష్టాలను ఓ సీన్ రూపంలో విడుదల చేయగా అది ఫన్నీగా ఉంది. ఈ సీన్‌లో గోదావరి జిల్లాలో పాడుకునే జానపద పాట సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల మధ్య వచ్చే సీన్‌ కూడా అదిరిపోయింది. సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు సన్నివేశాలను సినిమా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

https://youtube.com/watch?v=rd8U562rqZQ
Advertisement

తాజా వార్తలు

Advertisement