Thursday, May 2, 2024

హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ నేడే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే కొంత మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో మిగిలిన షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా ఈ రోజే రానుందని టాక్ నడుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. పవన్ కేరళలోని అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement