Wednesday, May 1, 2024

వచ్చేనెల అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్ ?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఇంకో 20 రోజుల షూటింగ్ ఉండగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

ఇదిలా ఉండగా ఈ నెల ఆఖరిలో ఫస్ట్ సింగిల్ వస్తుందని మొదట టాక్ నడిచింది. కానీ దానిపై చిత్రయూనిట్ మాత్రం ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. కానీ వచ్చే నెలలో మాత్రం అదిరిపోయే అప్డేట్ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీన బాలకృష్ణ పుట్టిన రోజు కాబట్టి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విధంగా అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మరి అప్డేట్ ఏం ఇస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement