Friday, May 3, 2024

థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న నటరత్నాలు.

ప్ర‌భ‌న్యూస్ : ఎన్‌.ఎస్‌.నాగేశ్వరరావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశ చిత్రం ‘నటరత్నాలు’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతున్నాయి. త్వరలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి గాదె నాగభూషణం దర్శకుడు. కథ, స్కీన్ర్‌ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా శివనాగు. ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పలు యువ నటుడు సుదర్శన్‌, రంగస్థలం మహేష్‌, అర్జున్‌ తేజ్‌ ప్రధాన పాత్రధారులు. భద్రం, తమిళ నటుడు శేషాద్రి ఇతర తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా క్రైం, థ్రిల్లర్‌, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. జూన్‌ మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి త్వరత్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement