Saturday, May 18, 2024

వెరైటీగా ఉగ్రం ప్ర‌మోష‌న్స్.. ట్రెండింగ్ మీమ్స్ ని రీ-క్రియేట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోలు

టాలీవుడ్ లో అల్ల‌రి న‌రేష్ సినిమాల్లో కామెడీ టైమింగ్ కి ఎంద‌రో ఫ్యాన్స్.. అయితే గతకొంత కాలంగా నరేష్‌ సినిమాలు ప్రేక్షకులకు బోర్‌ కొట్టేశాయి. దీంతో తనను తాను కొత్తగా ఆవిష్కరిస్తూ రెండేళ్ల క్రితం విజ‌య్ క‌న‌క‌మేడ‌ల అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తో ‘నాంది’ అనే సినిమా చేసి యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశాడు న‌రేష్. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూప‌ర్ క‌లెక్ష‌న్స్ సాదించి నరేష్‌కు తిరుగులేని గుర్తింపును, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. కాగా, మ‌రో సారి ఆ దర్శకుడితోనే చేతులు కలిపి ‘ఉగ్రం’ సినిమా చేశాడు. అయితే, ఇప్పటికే రిలీజ్ అయిన‌ టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి.

ఈ సినిమా మే 5న రిలీజ్‌ కాబోతుంది. ఇక మూవీ రిలీజ్ డేట్ కూడా ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో.. వరుస ప్రమోషన్‌లను స్టార్ట్ చేసింది మూవీ టీమ్. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా జరిపారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు విశ్వక్‌ సేన్, అడివిశేష్‌, సందీప్‌ కిషన్‌, నిఖిల్‌ గెస్ట్‌లుగా వచ్చారు. కాగా ఈ యంగ్‌ హీరోలు ఉగ్రం మూవీ ప్రమోషన్స్ ని వినూత్నంగా జరిపారు. ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్ ని రీ క్రియేట్ చేస్తూ.. నాంది తర్వాత నరేష్‌ స్క్రిప్ట్‌లలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే దాని మీద ఫన్నీగా వీడియోలను చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement