Wednesday, May 1, 2024

టామీ హిల్ ఫిగ‌ర్ కి బ్రాండ్ కి.. అంబాస‌డ‌ర్ గా స‌మంత‌

స‌మంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ..హాలీవుడ్ లో కూడా న‌టిస్తూ గ్లోబ‌ల్ స్టార్ గా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దాంతో స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రముఖ కంపెనీలు ఆమెను తమ బ్రాండ్ అంబాసడర్ గా తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ వాచ్ ల కంపెనీ టామీ హిల్ ఫిగర్ కంపెనీ సమంతను తమ ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ కంపెనీ యాడ్ లో సమంతా బొద్దుగా, ఎంతో క్యూటీ గా కనిపిస్తోంది. తన స్టైలిష్ లుక్ తో అందరినీ సామ్ మెస్మరైజ్ చేస్తోంది. సమంత ఇప్పుడు ఇండియన్ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. ‘పుష్ప’ సినిమాలోని ఐటెం సాంగ్ సామ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకుపోయింది. నార్త్ లో ఆమెను అభిమానిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. దీంతో, బాలీవుడ్ సైతం సమంతకు రెడ్ కార్పెట్ పరుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement