Sunday, May 19, 2024

Trailor Out “గుంటూరు కారం” లో ఘాటు,హాటు ఎక్కువే!

YouTube video

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ నేటి రాత్రి 09:09 గంటలకి రిలీజ్ చేశారు . . 2.47 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ లో ఘాటు ఎక్కువగానే ఉంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ను కలిపి ట్రైలర్ కట్ చేసారు

.యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి మరొక కీలక పాత్రలో నటించడం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement