Monday, April 29, 2024

‘టైగర్ నాగేశ్వరరావు డిజిట‌ల్ స్ట్రీమింగ్ పార్ట్​నర్​ ఫిక్స్.. క్రిస్మ‌స్ కానుక‌గా ఓటీటీలో..

మాస్ మహారాజా రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వం వహించిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం గ‌జ దొంగ అయిన‌ నాగేశ్వరరావు జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇవ్వాల (శుక్రవారం) థియేట‌ర్ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

కాగా, ఈ సినిమాకి ఓవ‌ర్ సీస్ (యూకే, అమెరికా) నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ నటనకు అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో ట్రెయిన్​ రాబరీ సీన్ హైలైట్ అని.. ఆల్రెడీ సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఇక‌, మరోవైపు సెకండ్ హాఫ్ రన్ టైమ్ ఎక్కువ అయ్యిందని, పాటలు బాలేదని కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది.

ఇక.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విష‌యానికి వస్తే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్ ని దక్కించుకుంది. ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల వ్యవధిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుండగా.. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రైమ్ వీడియోలో సినిమా విడుదల అయ్యే చాన్స్ కూడా ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement