Saturday, July 27, 2024

Anupama : ఈ షో టిల్లు గాడి కోస‌మే…

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో తన రెగ్యులర్ ఫొటోలతో ఎంతోమంది అబ్బాయిల మనసు కొల్లగొట్టింది. అయితే మొన్నటివరకు పద్దతిగా ట్రెడిషనల్ లుక్స్ మెస్మరైజ్ చేసిన అనుపమ.. ఇప్పుడు మోడరన్ లుక్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ హీరోయిన్ సిద్దు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్న‌ది. మూవీ నుంచి రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో అనుపమ చాలా హాట్ గా కనిపిస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అయితే.. లిప్‌లాక్ కిస్‌లు, అందాల ఆరబోతతో కొత్త అనుపమ కనిపించారు. ఇది చూసిన అనుపమ ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు. ఇక తాజాగా అనుపమ తన వెకేషన్ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో కూడా అనుపమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న‌ది.. టిల్లు గాడు ఇలా మార్చేశాడంటూ అనుప‌మ కామెంట్స్ చేస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement