Sunday, May 19, 2024

Thalapathy Vijay | తలపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు..

కోలీవుడ్ స్టార్ హీరోల దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ నెల (ఫిబ్రవరి) 2న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించాడు. వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా, తాజాగా విజయ్ కొత్త పార్టీ పేరులో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తొంది.

దళపతి విజయ్ కొత్త పార్టీని (తమిళగ వెట్రి కళగం) ఇంగ్లీషులో ‘టీవీకే’ అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడు కొన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తొంది. తమిళనాడులో ‘తమిళగ వాల్వురిమై కట్చి’ అనే పేరుతో ఓ పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీషులో ‘టీవీకే’ అని పిలుస్తున్నారు. దళపతి విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండడంతో తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరులో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement