Friday, May 3, 2024

జ‌పాన్ తో రామ్ చ‌ర‌ణ్ కి ఉన్న అనుబంధం ఇదే

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జీ20స‌ద‌స్సులో పాల్గొన్నారు. కాగా ఈ గౌర‌వం అందుకున్న ఏకైన ఇండియన్ హీరోగా ఆయన రికార్డులకు ఎక్కారు. జమ్మూ కాశ్మీర్ వేదికగా జరిగిన జీ 20 సదస్సులో రామ్ చరణ్ పలు విషయాలపై మాట్లాడారు. అలాగే వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్న ఆయన ఉపాసన ప్రెగ్నెన్సీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జపాన్ దేశంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసే క్రమంలో రామ్ చరణ్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది. ఈ మ్యాజిక్ అంతా జరిగింది జపాన్ లోనే. అందుకు నాకు జపాన్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఆ దేశం అంటే నాకు చాలా ఇష్టం , అన్నారు. నాకు యూరప్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జపాన్ దేశాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నా భార్య ఉపాసనకు ఏడో నెల. ఈ మ్యాజిక్ జరిగింది అక్కడే. జపాన్ దేశం, ప్రజలు, వారి సంస్కృతి నాకు ఎంతో ఇష్టం, అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. గత ఏడాది జపాన్ దేశంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేశారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్-ఉపాసన అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే ఉపాసన గర్భం దాల్చారని రామ్ చరణ్ చెప్పారు. కాగా చరణ్-ఉపాసన వివాహం చేసుకొని పదేళ్లు దాటిపోయింది. వీరు చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు తెలియజేశారు. ఈ శుభవార్త మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా వారసుడు వస్తున్నాడన్న వార్తను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement