Friday, April 19, 2024

బాత్‌రూమ్‌లో జారిపడ్డ సత్యేంద్ర జైన్.. ఆసుపత్రికి తరలింపు

ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఈరోజు ఉదయం తీహార్ జైలులోని బాత్రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో జైలు అధికారులు సత్యేంద్ర జైన్‌ను వెంటనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా, జైన్ గడచిన వారం రోజుల్లో అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. అయితే, బాత్‌రూమ్‌లో ఆయన కిందపడడంతో ఆయన వెన్నెముకకు గాయమైనట్టు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి జైన్‌ మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్నారు. అందులో భాగంగానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement