Friday, April 26, 2024

‘గ్యాంగ్ లీడర్’ వచ్చి ముప్పై ఏళ్ళు..

మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో గ్యాంగ్ లీడర్ ఓ స్పెషల్..చిరంజీవీ అసలు సిసలు మెనియా మొదలైంది ఈ సినిమాతోనే…ఈ సినిమా లో చిరంజీవి నటన, స్టైల్, డ్యాన్స్ కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రతి సీనులో చిరంజీవి తన ఫర్ఫామెన్స్ తో మరో రేంజ్ కి సినిమాను తీసుకెళ్లాడు. దీంతో ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంది. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మాస్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది గ్యాంగ్ లీడర్.

విజయ బాపినీడు దర్శకత్వంలో 1991లో మే 9న విడుదలైన ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.  ఈ సినిమా తరువాతే చిరంజీవిని టాలీవుడ్ లో అప్ కమింగ్ స్టార్స్ అందరూ తమ గ్యాంగ్ కు ఆయనే లీడర్ అని పిలుచుకోవడం మొదలయింది. ఈ సినిమాకు ముందు చిరంజీవికివరుసగా ప్రతి యేటా ఓ ఘనవిజయం లభించింది. దాంతో ‘గ్యాంగ్ లీడర్’ ఆరంభం నుంచీ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అంతకు ముందు చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’ (1987), ‘యముడికి మొగుడు’ (1988), ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ (1989), ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’ (1990) వంటి వరుస సూపర్హిట్స్ దక్కాయి. 1990లో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రం మే 9న జనం ముందు నిలచి, వారి మనసులు దోచుకుంది. ఆ సినిమా విడుదలైన సరిగా సంవత్సరానికి 1991 మే 5న ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై వీరంగం చేసింది. ఆ చిత్రం కన్నా మిన్నగా ‘గ్యాంగ్ లీడర్’ జయకేతనం ఎగురవేసింది.

ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ చింరజీవి పుట్టినరోజునాడు పెద్దయెత్తున తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు జరిపారు. 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. ఈ సినిమా ప్రదర్శితమైన నాలుగు ప్రధాన కేంద్రాలలో వందరోజుల వేడుకలు నిర్వహించడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement