Thursday, March 28, 2024

చిన్నపిల్లాడిలా మారిన రియల్ హీరో

రియల్ హీరో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి దేవుడు అయ్యాడు సోనూసూద్. సెకండ్ వేవ్ సమయంలో అయితే ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అయితే తాజాగా సోనూసూద్ చిన్న పిల్లాడిలా మారాడు.

ఎయిర్ పోర్ట్ లో చిన్న పిల్లాడిగా మారి ఎస్కలేటర్ మీద పై నుండి కిందకి వస్తున్న సోనూసూద్ మెట్ల మీద అడుగులు తీసి గాల్లో ఎగురుతున్నట్లుగా కిందవరకూ వచ్చాడు. దీన్ని ముందున్న వ్యక్తి వీడియో తీశాడు. సోనూ ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement