Thursday, April 25, 2024

అమెజాన్ లో పుష్ప స్పెషల్ పోస్టర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్… కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్… అలాగే టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి అమెజాన్ మ్యూజిక్ లో దర్శనమిచ్చింది.

ఈ స్పెషల్ బ్యానర్ ద్వారా అమెజాన్ ప్రైమ్ పుష్ప ను ప్రమోట్ చేస్తోంది. అయితే ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఈ లుక్ ను రిలీజ్ చేసినప్పుడు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండు పార్ట్ లుగా రిలీజ్ కాబోతున్న ఈచిత్రంలో మొదటి పార్ట్ ను క్రిస్మస్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement