Thursday, May 2, 2024

మా ఎన్నికల పై అధికారిక ప్రకటన వచ్చేసింది

మా అసోసియేషన్ ఎన్నికల బరిలో ఈసారి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ ,నటి హేమ నిలిచారు. కాగా మా ఎన్నికల తేదీని ఖరారు చేసింది క్రమశిక్షణ కమిటీ. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం గా ఉన్నట్టు అధికారిక ప్రకటన చేసింది.

ఇక ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే క్రమశిక్షణ కమిటీకి లేఖలు కూడా రాస్తున్నారు. ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయానికి వచ్చిన క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement