Friday, May 3, 2024

న‌రేష్ ‘ఉగ్రం’ కొత్త రిలీజ్ డేట్ క‌న్ఫామ్ చేసిన మేక‌ర్స్..

విజయ్ కనకమేడల డైరెక్ష‌న్ లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద‌ భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వీరి కాంబినేషన్ లోనే మరో వైవిధ్యమైన మూవీ ఉగ్రం రాబోతుంది. కాగా, ఇవ్వాల ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను వెల్లడించారు మేకర్స్. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడింది. దానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఉగ్రం మూవీ టీమ్.

ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. తాజాగా, రిలీజ్ డేట్ తో క‌లిపి ఓ క్రేజీ పోస్టర్ ను పోస్ట్ చేశారు మేకర్స్. పోస్టర్ లో అల్లరి నరేష్ రక్తపు మరకలతో వీపు మీద ఓ రౌడీని వేసుకుని కనిపించాడు. నిజంగానే నరేశ్ ఉగ్ర రూపంలో కనిపించి షాక్ ఇచ్చాడు. ఈ పోస్టర్ చూస్తుంటేనే.. ఈ సినిమా పూర్తి వైల్డ్ యాక్షన్ డ్రామాగా ఉండ‌నున్న‌ట్టు క‌నిపిస్తోంది. గతంలో ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ నాంది లాంటి సినిమాల‌తో మెప్పించిన నరేష్.. ఇప్పుడు ఉగ్రంతో మరోసారి ఆకట్టుకునేలా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement