Monday, May 6, 2024

‘బెదురులంక 2012’ ట్రైలర్ రిలీజ్ అప్పడుడే.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ అప్ కమింగ్ మూవీ ‘బెదురులంక 2012’. ఈ మూవీ చాలా కాలం క్రితమే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కాగా, ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల (ఆగస్ట్) 15న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా DJ టిల్లు ఫేమ్ నేహా షెట్టి హీరోయిన్ గా నటించింది. అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, అనితానాథ్, కిట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. మరి ఈ సినిమా కార్తికేయకి ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement