Monday, May 6, 2024

భారతీయుడు 2 సినిమా పై దర్శకనిర్మాతలకు హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా ?

1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాన్ని శంకర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఇక శంకర్ కూడా దీనిని పక్కనపెట్టి వేరొక సినిమా అని అనౌన్స్ చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ వారు మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేశారు. తమ సినిమా చేయకుండా మరో సినిమాని ఒప్పుకోవడం సరైనది కాదని ఇప్పటికే ఈ సినిమాకు 236 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని శంకర్ రెమ్యూనరేషన్ 40 కోట్లలో 14 కోట్లు చెల్లించాలని కోర్టుకు తెలిపింది.

కాగా ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. అయితే ఇరు పక్షాల వారు కూర్చుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. గతేడాది ఈ సినిమాను పూర్తి చేస్తానని శంకర్ చెప్పాడని కానీ ఇప్పటికీ చేయకపోవడంతో ఎంతో నష్టం వచ్చిందని లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు తెలిపింది. అలాగే శంకర్ కూడా తన వాదనలను వినిపించారు. ఇటీవల మరణించిన నటుడు వివేక్ పై తీసిన సన్నివేశాలు మళ్లీ రీషూట్ చేయాలని దీనికి మరికొంత సమయం పడుతుందని శంకర్ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని…. చెబుతూ ఈ కేసును ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement