Friday, June 21, 2024

ఆదరకొడుతున్న ‘హీరో’

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను స్వయంగా గల్లా జయదేవ్ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాకు హీరో అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది. అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. విడుదలైన 24 గంటల్లో అవ్వకముందే వన్ మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా హీరో టైటిల్ టీజర్ నాలుగు మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ జరిపారు. సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement