Saturday, May 4, 2024

ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్… మార్చి 31రెడీగా ఉండండి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మెగాస్టార్ రాంచరణ్ ఉన్న ఒక ఫోటో ను రిలీజ్ చేశారు. మరో వైపు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న ఓ లుక్ ని రిలీజ్ చేశారు.

తాజాగా ఆచార్య నుంచి ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చరణ్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించారు. మార్చి 31 సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఆచార్య ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ లాహే లాహే ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో చిరు స్టెప్‌ వేస్తు కనిపించారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1375758279146496004?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement