Friday, March 1, 2024

ది డోర్.. భావ‌న‌ ఫస్ట్ లుక్ పోస్టర్

ది డోర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకి ద‌శాబ్ద‌కాలం త‌ర్వాత ప‌ల‌క‌రించ‌నుంది న‌టి భావ‌న‌. ఈ కేరళ భామ నటిస్తోన్న తాజా చిత్రం ది డోర్ . మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. వరుణ్‌ ఉన్ని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్‌ జైదేవ్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను నేడు భావన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ లాంఛ్ చేశారు. డోర్‌ ముందు కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుండగా.. డోర్‌లో నుంచి రక్తంతో ఉన్న చేతులు బయటకు రావడం చూడొచ్చు. మొత్తానికి భావన ఈ సారి మాత్రం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్ ను ఎంటర్‌టైన్‌ చేయబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. గణేశ్ వెంకట్రామన్‌, జయప్రకాశ్‌, నంధు, శ్రీరంజిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. Junedreams Studio బ్యానర్‌పై నవీన్‌ రాజన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement