Wednesday, April 17, 2024

పవన్ ఫ్యాన్స్ రెడీనా…మూడో సాంగ్ వచ్చేస్తుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సమ్మర్ కానుకగా ఈ సినిమా మా రిలీజ్ కానుంది.

కాగా ఈ సినిమా నుంచి మగువా మగువా, సత్యమేవ జయతే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడవ సాంగ్ రిలీజ్ కానుంది. ఈనెల 17 సాయంత్రం 5 గంటలకు కంటి పాప.. కంటి పాప సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన గబ్బర్ సింగ్ బ్యూటీ శృతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నివేద థామస్, అంజలి ,అనన్య కీలక పాత్రలలో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement