Saturday, April 27, 2024

ఇటలీ షూట్ కంప్లీట్… ఫోటో షేర్ చేసిన హీరోయిన్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా రాశికన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్రయూనిట్ ఒక నెల క్రితం ఇటలీకి వెళ్లారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం థాంక్యూ యూనిట్ ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసింది.

ఈ నేపథ్యంలోనే ఇంటికి తిరిగి వస్తున్నాము అంటూ థాంక్యూ టీం ఓ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు షూటింగ్ సెట్ లో నాగ చైతన్య తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది రాశిఖన్నా. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక థాంక్యూ యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement