Thursday, April 18, 2024

ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజు 20 వేలపై చిలుకు కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడి చనిపోతున్నాయి. ఇప్పటికే సచివాలయం ఉద్యోగులు పలువురు మహమ్మారికి బలైయ్యారు. రాష్ట్రంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొంది. సచివాలయం, ఆయా శాఖల అధినేతలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఈ మార్పులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 12 గంటల తర్వాత కార్యాలయాలు ఉండాలంటే మాత్రం పాసులు కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనకు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, ఏపీలో కరోనా కట్టడిలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.  

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై వర్క్ ఫ్రం హోమ్!

Advertisement

తాజా వార్తలు

Advertisement