Thursday, April 25, 2024

థమన్ లయన్ డ్రమ్ బాలయ్య కోసమేనా ?

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న థమన్ ఇటీవల కాలంలో వరుస అవకాశాలు అందుకుంటూ సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్నాడు. అయితే ఫ్యూచర్ లో రాబోయే చాలా సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అందులో బాలయ్య అఖండ కూడా ఒకటి. ఇప్పటికే అఖండ సినిమాకి సంబంధించిన టీజర్ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు థమన్.

తాజా థమన్ డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు. అందులో ఓ సింహం కూడా కనిపిస్తుండంతో…. ఈ సెషన్ అఖండ కోసమే అయ్యుంటుందని మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్. అలాగే త్వరలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కూడా రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement