Monday, April 29, 2024

Thalaivar 170 | రజినీకాంత్ కొత్త మూవీ టైటిల్ రివీల్.. టీజర్ అదిరిందిగా..!

సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు స‌ద‌ర్భంగా.. ఆయ‌న నటిస్తోన్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ తలైవా 170 టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. కాగా, తాజాగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్‌‌తో ఈ మూవీ Vettaiyan అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు ఎనౌన్స్ చేశారు మేకర్స్.

YouTube video

ఇక ఈ సినిమాలో కూడా రజిని పోలీస్ గానే కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement