Monday, May 6, 2024

తంగ‌ల‌న్ షూట్ లో.. విక్ర‌మ్ కి తీవ్ర‌గాయాలు

త‌న సినిమాల్లోన్ని పాత్ర‌కోసం ఎంత‌టి రిస్క్ అయినా చేస్తాడు త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్.తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం తంగలన్. ఈ సినిమా షూటింగ్ లో హీరో విక్రమ్ కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఆయన తీవ్రంగా గాయపడినట్లు తమిళ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాదు ప్రమాదంలో విక్రమ్ పక్కటెముక విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ నీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి ఆపరేషన్ అవసరం అని వైద్యులు తెలిపారు. విక్రమ్ కి జరిగిన ప్రమాదాన్ని ధ్రువీకరించారు ఆయన మేనేజర్ సూర్యనారాయణన్.మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement