Wednesday, May 1, 2024

NagaChaitanya: తండేల్… ఇదేం టైటిల‌య్యా…నాగ చైత‌న్య‌..

యంగ్ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ లో సినిమా తెరకేక్కబోతున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు.

అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది. గెడ్డంతో రఫ్ లుక్ లో చైతన్య క్యారెక్టర్ ని కూడా పోస్టర్ లో చూపించేశారు. తండేల్ టైటిల్ వినడానికి ఇంటరెస్టింగ్ గా ఉంది. అయితే అసలు తెలుగులో ఈ పదాన్ని ఎప్పుడూ వెనలేదు . దీనికి అర్ధం ఏమిటా అని త‌ల‌లు బాదుకుంటున్నారు అభిమానులు ..ఇక ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది.. గ‌తంలో సాయి ప‌ల్ల‌వి, నాగ చైత‌న్య జంట‌గా న‌టించిన మూవీ ల‌వ్ స్టోరీ సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement