Friday, May 17, 2024

JanaSenani Pawan Kalyan : కెసిఆర్, కెటిఆర్ అంటే ఎన‌లేని గౌర‌వ‌మే… అయితే బిజెపి వ‌ల్లే బిసిల‌కు రాజ్యాధికారం

కొత్త‌గూడెం – తెలంగాణ అంటే నా రోమాలు నిక్క పొడుచుకువస్తున్నాయ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు ఇచ్చారని గుర్తు చేశారు. కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ, నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో పలు పార్టీలు కష్టపడ్డాయన్నారు. దశాబ్దం తరువాత ఇక్కడ రంగంలోకి వచ్చానని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి తోనే ఆంధ్ర లో పోరాటం చేస్తున్నానని అన్నారు. పేపర్ లీక్ లు వల్ల నిరుద్యోగులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 నుంచి అవినీతి పెరిగిందని మండిపడ్డారు. జలయజ్ఞంలో దోపిడీ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే అవినీతి పోతుందని భావించామన్నారు. గత పాలకులు చేసిన తప్పే మళ్ళీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. లెఫ్ట్ మిత్రులతో మాట్లాడుతూ వుంటానని అన్నారు. లెఫ్ట్ పద్దతిలోనే తను.. జనసేన పని చేస్తుందని అన్నారు. తెలంగాణలో కూడా కౌల్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు.

అలాగే తెలంగాణ పోరాట స్పూర్తిని గుర్తు చేసుకుంటూ.. ” జన్మ నిచ్చిన తెలంగాణ జై తెలంగాణ అన్నారు పవన్‌. తను తెలంగాణలో మాట్లాడే అవసరం వచ్చింది. పోరాట స్ఫూర్తి నీ ఇచ్చిన తెలంగాణ… అణగారిన తెలంగాణ కోసం తను అండగా వుంటానని.. వెనకడుగు ఎప్పుడు వేయనని అన్నారు. తెలంగాణలో వున్న పోరాట స్ఫూర్తి.. దేశమంతా వుంటే అవినీతి ఎప్పుడో వెళ్ళిపోయేదని అన్నారు. మీకు వెన్నంటి నిలబడే పార్టీలు తెలంగాణలో కావాలన్నారు. బీజేపీ పరిపాలన జరుగుతున్న రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యత ఉందన్నారు. గద్దరన్నకు చెప్పిన మాటకు తను నిలబడుతానని.. గద్దర్ ఆత్మ శాంతిగా వుండాలంటే ఆయన ఆశయాలను సాధించాలని గుర్తుచేసుకున్నారు. నిధులు నీళ్లు నియామకాలు కోసం పోరాటం చేశారని అన్నారు. తన మద్దతు నిర్ణయం నరేంద్ర మోడీ కి వుంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మీద గౌరవం, కేటీఆర్ మీద నమ్మకం వుందన్నారు. అయితే బీజేపీ వల్లనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే ఎన్నికలు రావాలని.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుందని కోరారు.


ఆంధ్రాలో గుండాల్ని రౌడీల్ని ఎదుర్కొని ఉన్నానంటే అది తెలంగాణ స్ఫూర్తి మాత్రమే అన్నారు. తాను లేకపోయినా తెలంగాణలో జనసేన వుంది అంటే ఇక్కడి కార్యకర్తల కృషి నాది మానవత్వం అన్నారు. సనాతన ధర్మం సోషలిజం రెండు ఓకే.. దానిలో వుండే విధంగా చేసిన దాశరథి నాకు స్ఫూర్తి అన్నారు. సనాతన ధర్మం సోషలిజం రెండింటినీ నేను నడిపిస్తా అన్నారు. మనస్పూర్తిగా బీజేపీకి మద్దతు జనసైనికులు ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నీ ఎందుకు తిట్టలేదు అంటే ఆంధ్ర లో మాదిరిగా బాగా తిరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement